Sunday, 16 July 2017

Ee Jeevitham Viluvainadi lyrics


ఈ జీవితం విలువైనది నరులార రండని సెలవైనది
సిద్ధపడినావ చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు

సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు
పోతున్నవారిని నువు చుచుటలేదా 
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా

మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకంలో ఉండే స్తిరుడెవడు
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి

పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు 
యేసు రక్తమే నీ పాపానికి మందు
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు

Thursday, 1 June 2017

ghanamaina naa yesayya lyrics

ఘనమైన నా యేసయ్య బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు
(నా)శిరము వంచి స్తుతియింతును నీ కృప సత్యములను ప్రకటింతును

నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము
నీ ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము
ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా
తరతరములుగా మనుషులను పోషించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను నే ఎన్నని ప్రకటించెదను నీ కార్యములు

మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము
నీ శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలి యాగము
మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నవయ్యా
మానవ జాతికి రక్షణ మార్గము చూపించు చున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను నే ఎన్నని ప్రకటించెదను నీ కార్యములు

సంఘ క్షేమముకై సంచ కరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము
అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపా వరములు
పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా
స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా
ఏమని వర్ణించెదను నీ ప్రేమను నే ఎన్నని ప్రకటించెదను నీ కార్యములు